బీఆర్ఎస్ అభ్యర్థికి సీపీఎం మద్దతు

బీఆర్ఎస్ అభ్యర్థికి సీపీఎం మద్దతు

MLG: గ్రామపంచాయతీని అభివృద్ధి చేసే వారికి తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని సీపీఎం జిల్లా అధ్యక్షుడు దావుద్ అన్నారు. ఏటూరునాగారంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలతకు తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. శ్రీలత గెలుపు కోసం తమ పార్టీ నాయకులం సహకరిస్తామని ఆయన అన్నారు. గ్రామంలోని సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని కోరారు.