మూగజీవాలకు తప్పని తాగునీటి కష్టాలు
KRNL: పెరుగుతున్న ఎండలతో మూగజీవాలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఆదోని పట్టణంలో మహాయోగి లక్ష్మమ్మ ఆలయ సమీపంలో ఓ వానరం వేసవి తాపంతో దాహం తీర్చుకునేందుకు ఇబ్బందులు పడింది. ఆలయ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కుళాయి వద్దకు వచ్చి కుళాయిని తిప్పి నీరు తాగి దాహం తీర్చుకుంది. అటువైపు వెళుతున్న జనం నీరు తాగుతున్న వానరాన్ని ఆసక్తిగా తిలకించారు.