పి.గన్నవరంలో అంగన్వాడీ కార్యకర్తల ధర్నా
కోనసీమ: పి.గన్నవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు మంగళవారం ధర్నా నిర్వహించి, కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని, వేసవి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనంపై ఈ నెల 18న ప్రకటన చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.