నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన అధికారి డీ. వీరరెడ్డి
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీలో మూడవ రోజు శుక్రవారం నామినేషన్ ప్రక్రియను జిల్లా వ్యయ పరిశీలన అధికారి డీ. వీరరెడ్డి పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియ సాఫీగా సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ విజయ్ సాగర్, ఎంపీడీవో వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ ఇమ్మడి సుధీర్ కుమార్ తదితర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.