'పదవ తరగతి పరీక్షా ఫలితాలు రికార్డ్ స్థాయిలో రావాలి'
కృష్ణా: పదవ తరగతి పరీక్షా ఫలితాలు రికార్డ్ స్థాయిలో రావాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు పిలుపునిచ్చారు. శనివారం అవనిగడ్డలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. రైజింగ్ స్టార్స్, షేరింగ్ స్టార్స్ వివరాలు ఆరా తీశారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు అనుసరిస్తున్న వందరోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు.