హర్మూజ్‌ను దాటిన మరో LPG నౌక
హర్మూజ్ జలసంధిని మరో భారత నౌక సురక్షితంగా దాటినట్లు కేంద్రం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 20 వేల టన్నుల LPGతో గ్రీన్ ఆశా అనే అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి ప్రవేశించినట్లు చెప్పాయి. రెండు రోజుల క్రిందట గ్రీన్ సాన్వీ అనే మరో నౌక 46,650 టన్నుల LPGతో మన జలాల వైపు ప్రయాణించిందని పేర్కొన్నాయి. దీంతో ఇప్పటి వరకు 9 భారత నౌకలు హర్మూజ్‌ను దాటాయి.