AVOPA ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ

AVOPA ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ

WNP: వినాయకచవితి పండుగ సందర్భంగా బుధవారం వనపర్తి పట్టణ AVOPA ఆధ్వర్యంలో 500 మట్టి గణపతి ప్రతిమలను రాజీవ్ చౌక్‌లో పంపిణీ చేశారు. అధ్యక్షుడు కలకొండ శ్రీనివాసులు మాట్లాడుతూ.. పర్యావరణం కింద నీరు కలుషితం కాకూడదని ఉద్దేశంతో మట్టి గణపతులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, పూరి బాలరాజు పాల్గొన్నారు.