విజయ ప్రవేశం స్మరిస్తూ 'మట్టల ఆదివారం'..!

విజయ ప్రవేశం స్మరిస్తూ 'మట్టల ఆదివారం'..!

GDWL: ఏసుక్రీస్తు జెరూసలేం నగరంలో గాడిదపై విజయ ప్రవేశం చేసిన ఘట్టాన్ని స్మరిస్తూ ప్రజలు 'మట్టల ఆదివారం' చేస్తారని పాస్టర్ దేవన్న తెలిపారు. రాజోలి మండల కేంద్రంలోని క్రైస్తవులు ఈత మట్టలు పట్టుకొని ప్రధాన రహదారిపై పాటలు పాడుతూ ర్యాలీ తీశారు. ప్రధాన కూడలిలలో పాస్టర్ దేవన్న సువార్తను వివరించారు. అనంతరం చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.