ఎస్సారెస్పీలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం..

WGL: పర్వతగిరి మండలం కొంకపాక ఎస్సారెస్పీ కెనాల్లో యువకుడు గల్లంతైన ఘటనలో సోమవారం మృతదేహం లభ్యం. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ ఎల్బీనగర్‌కు చెందిన నలుగురు స్నేహితులు మండలంలోని అన్నారంకు ఆటోలో వచ్చారు. తిరిగి వెళుతున్న క్రమంలో కెనాల్ వద్దకు రావడంతో బట్టలకు మురికి అంటుకుందని, శుభ్రం చేసుకుంటానని నీటిలో గల్లంతైన రహమాన్ మృతదేహం లభ్యమైంది.