విద్యుత్ షాక్‌‌‌తో వ్యవసాయ కూలీ మృతి

విద్యుత్ షాక్‌‌‌తో వ్యవసాయ కూలీ మృతి

NLG: విద్యుత్ షాక్‌‌కు గురై వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన పాలకవీడు మండలం, ఎల్లాపురంలో గురువారం చోటు చేసుకుంది. పాలకవీడు SI ఆర్. కోటేశ్ తెలిపిన వివరాల మేరకు.. వ్యవసాయ పనికి వెళ్లిన సైదులు గడ్డి కోస్తు ఉన్నసమయంలో విద్యుత్తు తీగకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.