'టీటీడీ ఛైర్మన్ రాజీనామా చేయాలి'
W.G: మహిళలతో అసభ్య ప్రవర్తనతో టీటీడీ పవిత్రతను దెబ్బతీసిన బి.ఆర్. నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు డిమాండ్ చేశారు. శనివారం తాడేపల్లిగూడెంలో నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడుతూ.. ఇన్ని ఆరోపణలు వచ్చినా పదవిలో కొనసాగడం భక్తుల మనోభావాలను గాయపరచడమేనన్నారు.