పాలకల్తీ ఘటన.. సుమోటోగా తీసుకున్న NHRC
E.G: రాజమండ్రి పాలకల్తీ ఘటననపై ఎన్‌హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటనను సుమోటోగా తీసుకుంది. ఏపీ సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో బాధితులు ఆరోగ్య పరిస్థతి, చనిపోయిన వారి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. గత నెల జరిగిన ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా.. పలువురు చికిత్స పొందుతున్నారు.