'సింథటిక్ ట్రాక్ పనులను వేగవంతం చేయాలి'
KMM: సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య క్షేత్రస్థాయిలో సమీక్షించారు. స్టేడియంలో నిర్మిస్తున్న సింథటిక్ ట్రాక్ పనులను నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా, అత్యంత వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల వేగంలో 'వెలాసిటీ'ని ప్రదర్శిస్తూ గడువులోగా అందుబాటులోకి తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు.