'ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా? కాల్ చేయండి'

WGL: తెలంగాణ ప్రజలను కోటీశ్వరులుగా చూడాలన్నదే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆశయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు అన్నారు. ప్రజాపాలనలో ఏ అధికారి, నాయకునికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గంలో ఎవరైనా డబ్బులు అడిగితే 8096107107కి ఫిర్యాదు చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.