'ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి'
WNP: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిబంధనల మేరకు, పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ యాదయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బోర్డు సూచనల ప్రకారం పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ అధికారి అంజయ్య, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.