పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

అన్నమయ్య: చిన్నమండెం మండలం దేవగుడిపల్లె రాజీవ్ కాలనీలో శనివారం జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దనే బయోమెట్రిక్ సదుపాయం ద్వారా వేలిముద్ర తీసుకుని నగదు అందించే ప్రక్రియను, వృద్ధాప్య, ప్రతిభావంతుల పింఛన్ల పంపిణీని ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు.