కోర్టు ఎదుట వైసీపీ నేత చెవిరెడ్డి హల్‌చల్

AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విజయవాడ ACB కోర్టు ఎదుట హల్‌చల్ చేశారు. తానేమీ తప్పుచేయలేదని, మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదన్నారు. 'నేను మద్యం తాగలేదు.. అమ్మలేదు. నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు. కేసులో ఇరికించిన వారిని వదిలిపెట్టను. పైన దేవుడున్నాడు.. అన్నీ చూసుకుంటాడు' అంటూ పోలీసు జీపు ఎక్కి వెళ్లిపోయారు.