జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో కోతుల బెడద

జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో  కోతుల బెడద

SRD: జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో కోతుల మంద రోడ్డుపై తిరుగుతుండటంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. శనివారం వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. ఆకలితో ఉన్న కోతులు ఇళ్ల వద్దకు చేరి వస్తువులను లాక్కెళ్లడం, చెట్లపై నుంచి రోడ్డుపైకి దూకడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితి వల్ల పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు.