నాగబాబుతో ఎమ్మెల్యేలు సమావేశం
AKP: జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు పార్టీ కార్యాలయంలో నాగబాబుతో జరిగిన సమావేశంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు ఎమ్మెల్యేలకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు.