విద్యుత్ షాక్ తగిలి పాడి ఆవు మృతి

విద్యుత్ షాక్ తగిలి పాడి ఆవు మృతి

MDK: విద్యుత్ షాక్‌తో ఆవు మృతి చెందిన ఘటన టెక్మాల్ (మం) మల్కాపూర్‌లో చోటుచేసుకుంది. సదరు గ్రామ వాసి పాత్ లోత్ రంగా లాల్ అనే రైతుకు చెందిన ఆవు వ్యవసాయ పోలంలోని ట్రాన్స్‌ఫార్మార్ విద్యుత్ వైరు తగిలి అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంతో దాదాపు రూ. లక్ష వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వ ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.