32 వ వార్డులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం

గుంటూరు: వినుకొండ పట్టణంలోని 32వ వార్డులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, గోనుగుంట్ల హరీష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోని వివరించారు. చంద్రబాబు సీఎం అయితేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.