రాజాం నూతన మున్సిపల్ కమిషనర్ నియామకం
VZM: రాజాం మున్సిపల్ కమిషనర్‌గా రేపల్లె మున్సిపాలిటీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ రామచంద్రరావును నియమిస్తూ మున్సిపల్ పరిపాలనశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు పదోన్నతులలో భాగంగా ఆయన ఇక్కడకు రానున్నారు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు గతనెలలో తణుకుకు బదిలీ కావడంతో మేనేజర్ శ్రీనివాసరావు విధులు నిర్వహిస్తున్నారు.