హార్వెస్టర్‌లో చీర చిక్కుకుని మహిళకు తీవ్ర గాయాలు
SDPT: దౌల్తాబాద్ మండలంలోని ముబారస్పూర్ గ్రామానికి చెందిన ఎం. డి. చాంద్ బీకి వ్యవసాయ పనిలో ప్రమాదం జరిగింది. అహ్మద్ నగర్ గ్రామ శివారులోని పొలంలో మొక్కజొన్న కోత సమయంలో హార్వెస్టర్ మిషన్‌లో చీర కొంగు చిక్కుకోవడంతో ఆమె ఎడమ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో దౌల్తాబాద్ 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు.