'లక్ష్మీపేటలో తాగునీటి సమస్యను పరిష్కరించాలి'
AKP: మాడుగుల మండలం లక్ష్మీపేట గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని గిరిజన మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. 15 కుటుంబాలు ఉన్న గ్రామంలో నెలరోజుల నుంచి మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఇప్పటికైనా తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.