బ్యాలెట్ పేపర్ మింగిన ఓటర్

బ్యాలెట్ పేపర్ మింగిన ఓటర్

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా వెంకటాపూరులో వెంకట్ అనే ఓటర్ మద్యం మత్తులో బ్యాలెట్ పేపర్ మింగేశాడు. ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వచ్చిన అతడు బ్యాలెట్ పేపర్‌ను నమిలి మింగేశాడు. పరిస్థితి గమనించిన పోలింగ్ అధికారులు వెంకట్‌ను పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.