'కూటమి ప్రభుత్వంలో ప్రజాసంక్షేమానికే అగ్రస్థానం'

'కూటమి ప్రభుత్వంలో ప్రజాసంక్షేమానికే అగ్రస్థానం'

KKD: జగ్గంపేటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొని కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి అగ్రస్థానం ఇస్తుందని తెలిపారు. ప్రతి నెల తొలి తేదీన పింఛన్లు ఇవ్వడం పేదలకు భరోసా అన్నారు. గత 17 నెలల్లో రూ. 50 వేల కోట్లు పింఛన్లకే ఖర్చు చేశామని పేర్కొన్నారు. మల్లిసాలలో ఇండస్ట్రియల్ పార్క్, భూపతిపాలెంలో ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు చేసారన్నారు.