విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికుల మహాధర్నా..!
GDWL: న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గద్వాల విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ కార్మికులు గురువారం మూడో విడత మహాధర్నా నిర్వహించారు. ఈ నిరసనకు 327 యూనియన్ నాయకులు మద్దతు తెలిపారు. 2016 డిసెంబర్ 4 నాటికి పనిచేస్తున్న మిగిలిన కార్మికులందరినీ ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.