మాజీమంత్రి రోజాకు పెళ్లి పత్రిక అందజేత

మాజీమంత్రి రోజాకు పెళ్లి పత్రిక అందజేత

ATP: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి తన సోదరుడు రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలను పలువురు ప్రముఖులకు అందజేశారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జేసీ పవన్‌ రెడ్డి నివాసాలకు వెళ్లి ఆహ్వాన పత్రికలు ఇచ్చారు. వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.