పిఠాపురంలో 'ఫైవ్ మెన్ కమిటీలు'
KKD: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో 'ఫైవ్ మెన్ కమిటీల'ను నియమించి, 'సింగిల్ మెన్' ఆధిపత్యానికి ముగింపు పలికారు. ఈ నేపథ్యంలో బుధవారం మంగళగిరిలో ఆయన కీలక పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా, పిఠాపురం తరహాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో తక్షణమే 'ఫైవ్ మెన్ కమిటీలను' నియమించాలన్నారు.