VIDEO: పొలం బాట పట్టిన ఎమ్మెల్యే
CTR: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పొలం బాట పట్టారు. 'రైతన్నా మీ కోసం' కార్యక్రమంలో భాగంగా మంగళవారం చిత్తూరు రూరల్ మండలం పాలూరు గ్రామపంచాయతీ, పాలం తోపు గ్రామంలో పర్యటించి రైతులతో ముచ్చటించారు. పొలం గట్లపై నడుస్తూ రైతులతో మాట్లాడారు. అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చాయా అని ఆరా తీశారు. డబ్బులు అందాయని రైతులు సంతోషంగా సమాధానం చెప్పారు.