VIDEO: ఎట్టకేలకు వసతిగృహం మార్పు

VIDEO: ఎట్టకేలకు వసతిగృహం మార్పు

AKP: కే.కోటపాడు మండలం కోరువాడ బీసీ వసతి గృహం శిధిలావస్థకు చేరడంతో సోమవారం విద్యార్థులు చేసిన ఆందోళనకు జిల్లా కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కే.శ్రీదేవి, వెల్ఫేర్ ఆఫీసర్, సర్పంచ్ సహకారంతో మంగళవారం స్థానిక కళ్యాణ మండపంలోకి వసతి గృహాన్ని మార్పు చేశారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.