VIDEO: రోడ్డు ప్రమాదాల నివారణకు బారికేడ్ల ఏర్పాటు
KRNL: కోటేకల్ సమీపంలో నిన్నటి రోజు శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించిన నేపథ్యంలో ఇకపై ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఎమ్మిగనూరు పోలీసులు చర్యలు చేపట్టారు. నిన్న ప్రమాదం జరిగిన ప్రాంతాలతో పాటు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న మొత్తం 6 చోట్ల ఇవాళ ఆదివారం బారికేడ్లు ఏర్పాటు చేశారు.