రైల్వే గేట్ పనులు పూర్తి చేయాలని ఎంపీకి వినతిపత్రం

రైల్వే గేట్ పనులు పూర్తి చేయాలని ఎంపీకి వినతిపత్రం

WGL: GWMC 17వ డివిజన్ పరిధిలోని జానిపిరిల ప్రాంతంలో గల రైల్వే గేట్ నిర్మాణ పనులు గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. దీంతో స్థానికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో స్థానికులు WGL ఎంపీ కడియం కావ్యను కలిసి, సమస్యపై వినతిపత్రం ఇచ్చారు. నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల స్థానికులు అసౌకర్యానికి గురవుతున్నారని, త్వరగా నిర్మాణం పనులు పూర్తిచేయాలని కోరారు.