రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

ADB: రానున్న లోక్ అదాలత్‌ను వినియోగించుకొని ఎక్కువ కేసులు రాజీకి కృషి చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బుధవారం ఆదిలాబాద్ రూరల్ మండలం పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. అసెంబ్లీ కార్యక్రమాలు జరగకుండా చూడాలని పేర్కొన్నారు. ఎస్పీతోపాటు డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ ఫణిదర్, ఎస్సై విష్ణువర్ధన్. సిబ్బంది పాల్గొన్నారు.