సావిత్రిబాయి జయంతికి లక్ష్మారెడ్డి విరాళం
MBNR: సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా నిర్వహించే ఉత్తమ ఉపాధ్యాయులు, సంఘ సేవకులు, బీసీ కుల సంఘాల అధ్యక్షుల సన్మానం, విగ్రహాల పంపిణీ కార్యక్రమాల కోసం జడ్చర్ల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తన వార్షిక వేతనం రూ.6 లక్షలను విరాళంగా అందించారు. సమాజ సేవకు తన వంతు సహకారంగా ఈ విరాళం ఇచ్చినట్లు తెలిపారు.