భోగాపురంలో ప్రశిక్షణ మహా అభియాన్
VZM: భోగాపురం మండలం రాజాపులోవలో నిర్వహించిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్తలు పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యపద్ధతులు, బూత్ మేనేజ్‌మెంట్, సోషల్ మీడియా ప్రాముఖ్యత వంటి అంశాల గురించి వివరించారు. అలాగే కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.