నేడు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న మంత్రి

నేడు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న మంత్రి

గుంటూరు జిల్లా కొల్లిపర మండల పరిషత్ కార్యలయంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గంటారని, బాధితులు స్వయంగా అర్జీలు సమర్పించవచ్చన్నారు. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు హాజరవనున్నట్లు పేర్కొన్నారు.