అనంతపురంలో ఈరోజు ఉష్ణోగ్రతలు.!
ATP: జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు నమోదు అవుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. కనిష్టంగా ఉదయం 22 డిగ్రీలు నమోదు అయ్యింది. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్పితే బయటకు రాకపోవడం మంచిది. సూర్యాస్తమయం సాయంత్రం 6.29కి కానుంది.