'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'
NRML: వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సోమ భీంరెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం మామడ మండలం పోన్కల్ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు.