ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుకు కలెక్టర్ సూచనలు

ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుకు కలెక్టర్ సూచనలు

నారాయణపేట: జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆయిల్ పామ్ తోటల సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయాలని చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి, రైతులకు సాగుపై సబ్సిడీ, లాభాలు, అవగాహన అందించాలని సూచించారు. మార్చి నాటికి 3,500 ఎకరాల సాగు లక్ష్యాన్ని జిల్లా చేరుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.