దొడ్డి కొమురయ్య జీవిత చరిత్ర సినిమా పోస్టర్ ఆవిష్కరణ
ASF: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా పోస్టర్‌ను MLA కోవ లక్ష్మి ఆసిఫాబాద్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మన్ అలిబిన్ అహ్మద్, BRS నాయకులు పాల్గొన్నారు