VIDEO: ఆస్తి పన్ను వసూళ్లు వేగవంతం చేయడానికి చర్యలు
ASF: కాగజ్ నగర్ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్లను వేగవంతం చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఆధ్వర్యంలో సిబ్బంది వార్డుల వారీగా తిరుగుతూ బకాయిల వసూళ్లను కొనసాగిస్తున్నారు. పన్ను బకాయిలు చెల్లించని మొండి బకాయిదారుల ఆస్తి పన్ను జప్తు చేసేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు.