బాలికల సంరక్షణ అందరి బాధ్యత: CDPO
KDP: బాలికల సంరక్షణ మనందరి బాధ్యత అని కడప ICDS అర్బన్ CDPO వాణిశ్రీ అన్నారు. మంగళవారం సిద్ధవటం మండలం లింగంపల్లి ప్రైమరీ పాఠశాలలో 'బేటీ బచావో బేటీ పడావో' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో బాల బాలికల మధ్య తేడాలు చూపద్దన్నారు. బాలికల రక్షణ పొందేందుకు చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098ను సంప్రదించాలన్నారు.