'గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలి'
VKB: కోట్పల్లి ప్రాజెక్టు వరద ఉద్ధృతితో బ్రిడ్జి కొట్టుకుపోయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్పల్లి ప్రాజెక్టు వరద ఉద్ధృతితో నాగసమందర్ గ్రామానికి వెళ్లే బ్రిడ్జి కొట్టుకుపోవడంతో నిత్యం అవస్థలు పడుతున్నామని,అధికారులు వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.