ఆదర్శవంతంగా మండల సమాఖ్యలకు ప్రణాళికలు
VZM: జిల్లాలో 17 మండల సమాఖ్యలు ఆదర్శవంతంగా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందించి సెర్ఫ్ జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్‌కు పంపించడం జరుగుతోందని అదనపు సంచాలకులు సావిత్రి చెప్పారు. మంగళవారం గజపతినగరంలోని వెలుగు మండల సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం పి.నారాయణరావు ఆధ్వర్యంలో రెండో విడత విజన్ బిల్డింగ్-2 జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం మంగళవారం జరిగింది.