రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు
SRPT: మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులోని ఓ పాఠశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నడిగూడెం మండలానికి చెందిన వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి కోదాడలోని ఓ షాప్‌లో పని ముగించుకుని స్వగ్రామానికి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..