దెబ్బతిన్న పంటలను పరిశీలన
MDK: చేగుంట మండలంలో గత రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, వ్యవసాయ అధికారులతో కలిసి మక్కరాజ్ పేటలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి దెబ్బతిన్న పంటలకు పరిహారం అందే విధంగా చూస్తానని శ్రీనివాసరెడ్డి రైతులకు హామీ ఇచ్చారు.