'పోలీసులు రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలి'
SKLM: భారత రాజ్యాంగం - దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం తన కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. పోలీసులు రాజ్యాంగ స్ఫూర్తిని తమ పనితీరులో అలవర్చుకోవాలని అని పేర్కొన్నారు.