నేడు పుట్లూరు మండలంలో కలెక్టర్ పర్యటన

ATP: పుట్లూరు మండల కేంద్రంలో శనివారం నిర్వ హించే స్వర్ణాధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొననున్నట్లు ఎంపీడీవో అలివేలమ్మ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీ కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి అధికారులు తప్పక హాజరు కావాలని సూచించారు.