అభిషేక్‌ను అడ్డుకోవడం కష్టమే: మార్‌క్రమ్

అభిషేక్‌ను అడ్డుకోవడం కష్టమే: మార్‌క్రమ్

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో సౌతాఫ్రికాతో ఈరోజు జరగబోయే తొలి టీ20లో అందరి కళ్లు అభిషేక్ పైనే ఉన్నాయి. ఈ క్రమంలో సౌతాఫ్రికా ప్లేయర్ ఐడెన్ మార్‌క్రమ్ మాట్లాడుతూ.. 'అభిషేక్‌తో కలిసి SRHకు ఆడాను. అతడు విధ్వంసక ఆటగాడు. ఈ మ్యాచ్‌లో అతడి వికెట్ చాలా కీలకం. పవర్ ప్లేలో అతడిని అడ్డుకోవడం బౌలర్లకు సవాలే' అని పేర్కొన్నాడు.